ఈ నెల 10న జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు.. కృష్ణా జిల్లా నందిగామ, నూజివీడులో నేడు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికారులు నూజివీడు పురపాలక సంఘం కార్యాలయంలో.. పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగులు.. ఇతర చోట్ల పోలింగ్ విధులు నిర్వహించనున్న ఉద్యోగులు నేడు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇదీ చదవండి:
'బాలకృష్ణ చిన్న పిల్లోడు... ఆయన్ను పెద్దగా పట్టించుకోనక్కర్లేదు'