ఇదీ చూడండి:
'మా కాలనీలో డంపింగ్ యార్డు తొలగించండి' - పోరంకిలోని వెంకటాపురం కాలనీ వాసుల ధర్నా
తమ కాలనీకి ఎదురుగా చెత్తను డంపింగ్ చేయవద్దని పలుమార్లు అధికారులతో మెుర పెట్టుకున్నారు అక్కడి వాసులు. స్పందన కార్యక్రమంలోనూ తమ విన్నపాన్ని అధికారుల ముందుంచారు. ఎవరూ వారిని పట్టించుకోలేదు సరికదా... మరింత చెత్తను వేస్తూనే వచ్చారు. విసిగిన కాలనీ వాసులు సీఎం స్పందించాలంటూ ధర్నాకి దిగారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా విజయవాడలో జరిగింది.
చెత్తను తమ కాలనీ ఎదుట డప్పింగ్ చెయవద్దంటూ ధర్నా
కృష్ణా జిల్లా విజయవాడలోని పోరంకిలో... వెంకటాపురం కాలనీ వాసులు ధర్నాచౌక్ వద్ద ఆందోళనకు దిగారు. తమ ప్లాట్ల వద్ద చెత్త వేయవద్దని రెండేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుంటున్నా... ఫలితం లేదని వాపోయారు. చెత్త, ఇతర వ్యర్థాలను తమ కాలనీ ముందు రహదారి మీద పోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగా... అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చెత్తను అక్కడి నుంచి తరలించాలని పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్ ఇంతియాజ్ దృష్టికి తీసుకెళ్లినా... పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా స్పందించి తమ ప్రాంతంలో చెత్త వేయకుండా చూడాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంపై స్పందించి... చర్యలు తీసుకోకుంటే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:
Intro:AP_VJA_16_02_PORANKI_RESIDENTS_DHARNA_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) తమ ప్లాట్లలోచెత్త వేయవద్దని గత రెండేళ్లుగా అధికారులకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుంటున్నా తమ మొర ఆలకించడం లేదని విజయవాడ పోరంకిలో నివసించే వెంకటాపురం కాలనీ వాసులు ధర్నాచౌక్లో ఆందోళనకు దిగారు. పోరంకి పంచాయతీ వారు గ్రామంలోని చెత్తను ఇతర వ్యర్ధాలను తమ ముందు రహదారి మీద పోస్తున్నారని దీని వలన అక్కడ నివసించే ప్రజలకు రైతులకు పశువులకు అందరికీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని వెంకటాపురం కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ లేఅవుట్ల ముందున్న కామన్ ఏరియా, రహదారిపై పోరంకి పంచాయతీ వారు చెత్త డంపింగ్ చేస్తున్నారని.... తాము గృహాలు నిర్మించుకోవాలంటే అక్కడ ఉన్న చెత్త తీవ్ర అడ్డంకిగా మారిందని తక్షణమే చెత్తను అక్కడి నుండి తరలించాలని, పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా తమ ఫ్లాట్ లలో పోస్తున్న చెత్తను ఆపివేయలని, ప్రస్తుతం ఉన్న చెత్తను మరో చోటకు తరలించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకుంటే న్యాయ పోరాటం చేస్తామని వెంకటాపురం కాలనీవాసులు హెచ్చరించారు.
బైట్స్.... వెంకటాపురం కాలనీ వాసులు
Body:AP_VJA_16_02_PORANKI_RESIDENTS_DHARNA_AVB_AP10050
Conclusion:AP_VJA_16_02_PORANKI_RESIDENTS_DHARNA_AVB_AP10050
Body:AP_VJA_16_02_PORANKI_RESIDENTS_DHARNA_AVB_AP10050
Conclusion:AP_VJA_16_02_PORANKI_RESIDENTS_DHARNA_AVB_AP10050
Last Updated : Nov 2, 2019, 7:58 PM IST