ETV Bharat / state

ఓ మృగాడి చర్యకు.. ఆ చిన్నారి తల్లైంది...!

author img

By

Published : Nov 2, 2019, 8:46 AM IST

పుస్తకాలు పట్టి పాఠశాలకు వెళ్లాల్సిన ఓ చిన్నారి తల్లైంది. వరసకు అన్న అయిన బంధువే మృగాడిలా మారి.. ఆ బాలికపై అఘాయిత్యం చేశాడు. పాఠశాలకు వెళ్లాల్సిన వయసులో.. అవమానాలు దిగమింగుతూ, ఆ బరువును మోసింది. చివరకు బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించటం వల్ల వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేశారు. కృష్ణా జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది.

ఓ మృగాడి చర్యకు.. ఆ చిన్నారి తల్లైంది...!

ఓ మృగాడి చర్యకు.. ఆ చిన్నారి తల్లైంది...!
అన్న వరసైన మృగాడు పైశాచికంగా చేసిన దాడిలో గర్భం దాల్చిన 13 ఏళ్ల బాలిక బిడ్డకు జన్మనిచ్చిన ఘటన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగు చూసింది. కృష్ణా జిల్లాకు చెందిన ఈ బాలికపై పెద్దమ్మ కొడుకైన మోహన్ కుమార్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మూడు నెలల కిందట వెలుగుచూసింది. అప్పటికే బాలిక ఆరు నెలల గర్భవతి అవడం వల్ల స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సంరక్షణలో బాలికను ఉంచారు. నిందితుడు మోహన్‌ కుమార్​పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

బాలికకు నెలలు నిండడం వల్ల ఇటీవల మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె రక్తహీనత, ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నందున విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన బాలికకు వైద్యపరీక్షలు నిర్వహించి.. గురువారం శస్త్రచికిత్స చేశారు. ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రక్తహీనత సమస్య అధికంగా ఉండడం వల్ల మరికొన్ని రోజులు వారిని ఆసుపత్రిలోనే ఉంచాలని వైద్యులు సూచించారు.

బాలిక తల్లిదండ్రుల ఇంటి సమీపంలోనే వారి బంధువులు పెద్దమ్మ కుటుంబం నివసిస్తుండేవారు. బాలిక తల్లిదండ్రులు ఇంటి దగ్గర లేని సమయంలో పెద్దమ్మ కొడుకు మోహన్ కుమార్ మాయమాటలు చెప్పి అనేకసార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించడం వల్ల భయపడిన ఆమె.. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. చిన్నారి పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు... గట్టిగా అడిగేసరికి జరిగిన విషయాన్ని బాలిక బయటపెట్టింది. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా.... ఆరు నెలల గర్భవతిగా తేలింది. గర్భవిచ్ఛిత్తి చేసేందుకు అవకాశం లేకపోవడం వల్ల అప్పటి నుంచి ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణలో ఉంచారు.

ఇదీ చదవండి :

గంట వ్యవధిలోనే... తల్లీ, కూతురు మృతి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.