కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో నాటు సారా స్థావరాలపై పోలీసులు మెరుపుదాడులు చేసారు. అవనిగడ్డ పరిధిలో తుంగలవారిపాలెం లంకలో సారా తయారు చేస్తున్న స్థావరాలను ధ్వంసం చేసి ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 700 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి, 40 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నాగాయలంక స్టేషన్ పరిధిలో సారా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 20 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు నాగాయలంక ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి: రోడ్డెక్కిన కరోనా థీమ్ శకటాలు