కృష్ణా జిల్లా బంటుమల్లి మండలం కండ్రికలో నాటుసారా తయారీపై ఆధారపడి జీవిస్తున్న వారికి పరివర్తన పేరుతో పోలీసులు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నాటుసారా వల్ల కలిగే అనర్ధాలను వివరించారు. బంటుమిల్లి మండల పరిధిలోని రామవరపు మోడీ, కండ్రిక ప్రాంతాలకు చెందిన 108 కుటుంబాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇక నుంచి నాటుసారా కాయమని ప్రతిజ్ఞ చేశారు.
సారా వల్ల స్థానికంగా ఉండే యువకుల భవిష్యత్ నాశనమవుతుందని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు విచారం వ్యక్తం చేశారు. ఈ వృత్తిని వదిలి వచ్చిన యువకులకు జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇది చదవండి నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం.. 14 మంది అరెస్టు