ETV Bharat / state

సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు

కృష్ణా జిల్లావ్యాప్తంగా పోలింగ్​ బూతులను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. ఓటర్లకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. సున్నిత ప్రాంతాల్లో భద్రతా చర్యలను పర్యవేక్షించారు.

police looking after security arrangements for elections in krishna district
సమస్యాత్మక ప్రాంతాలకు ప్రత్యేక ఏర్పట్లతో పోలీసులు సిద్ధం
author img

By

Published : Feb 5, 2021, 7:19 PM IST

విజయవాడ నగర శివారులో కొత్తూరు, తాడేపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే పోలింగ్ బూత్​లను విజయవాడ నగర పోలీస్ కమీషనర్ బి. శ్రీనివాసరావు పరిశీలించారు. గ్రామాల్లో సమస్యాత్మక ప్రాతాలు ఎమైనా ఉన్నాయా అంటూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాట్లు చేయాలని సీపీ సూచించారు. పర్యటనలో సీపీ వెంట ఏడీసీపీ విక్రాంత్ పాటిల్, ఇతర అధికారులు ఉన్నారు.

కృష్ణా జిల్లా పామర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు సందర్శించారు. జిల్లాలో గుడివాడ డివిజన్​లో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయిన్నట్టు తెలిపారు. జిల్లాలో సున్నితమైన ప్రాంతాలు, సమస్యాత్మక గ్రామాల్లో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి వ్యక్తి ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం కల్పిస్తూ.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

కేంద్ర బడ్జెట్​పై అఖిలపక్ష పార్టీల సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.