ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మకు విజయవాడ నగర పోలీసు అధికారులు ఆషాడ సారెను సమర్పించారు. నగర పోలీస్ కమిషనర్ ద్వారకాతిరుమలరావు దంపతులు, జాయింట్ పోలీస్ కమిషనర్ నాగేంద్రకుమార్ దంపతులు, డీసీపీలు, ఏసీపీ, పోలీసు సిబ్బంది కుటుంబసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసుల బృందానికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పోలీసు అధికారులు సతీమణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పిండివంటలతో కూడిన పవిత్ర సారెను సమర్పించారు. ఆషాడ మాసం చివరి రోజున దుర్గమ్మకు ఆలయ అర్చకుల బృందం పవిత్ర సారె సమర్పించనుంది.
ఇదీ చదవండి:నాగుపామును మింగిన 'శభాష్'పల్లి కోడి