కృష్ణా జిల్లా నందిగామలో పోలీసులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కర్ఫ్యూ నిర్వహించారు. నందిగామ సీఐ పి. కనరావు ఆధ్వర్యంలో రాత్రి పట్టణ పుర వీదుల్లో పోలీసులు గస్తీ నిర్వహించారు. కరోనా నియంత్రణకు సహకరించాలని.. ప్రజలు రాత్రి సమయాల్లో బయటకు రావద్దని సీఐ తెలిపారు. కర్ఫ్యూ నిబంధనలు పాటించాలని కోరిన ఆయన తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమలలో ఉంటుందని పేర్కొన్నారు. రాత్రి సమయాల్లో నిబంధనలు ఉల్లంఘించి.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చూడండి...