కృష్ణాజిల్లా నందిగామ మండలం కమ్మవారి పాలెంలో బాలికను వేధిస్తున్న గ్రామ వాలంటీర్‌పై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కమ్మవారి పాలెంలో గ్రామ వాలంటీర్‌గా పని చేస్తున్న తలారి జోజి... గ్రామ౦లోని 17 ఏళ్ల బాలికకు ఇటీవల సెల్‌ఫోన్ కొనిచ్చి ప్రతిరోజు తనతో మాట్లాడాల వేధిస్నితున్నాడని పోలీసులు తెలిపారు.
విషయం తెలుసుకున్న బాలిక తండ్రి వార్డు వాలంటీర్‌ను ప్రశ్నించగా, దాడి చేసి గాయపరిచారన్నారని వారు పేర్కొన్నారు. దీంతో బాలిక.. తండ్రి నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వాలంటీర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తాతాచార్యులు తెలిపారు.
ఇదీ చదవండి: కాకినాడ హార్బర్ లో మరో బోటు దగ్ధం...కారణమేంటి ?