ETV Bharat / state

CPS పై ఆందోళనకు సిద్ధమైన ఉద్యోగులు, నిలువరించే మార్గాల్లో పోలీసులు

CPS రద్దుపై ఆందోళనకు సిద్ధమైన ఉద్యోగులను నిలువరించేందుకు, పోలీసులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. చలో విజయవాడ, సీఎం నివాసం ముట్టడిలో పాల్గొనకుండా, సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులకు వ్యక్తిగతంగా నోటీసులిస్తూన్నారు. తహసీల్దార్ల ఎదుట బైండోవర్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఉద్యోగులు పిలిస్తే కిరాయికి వెళ్లవద్దంటూ ప్రైవేటు వాహనదారులకు సూచిస్తున్నారు. విజయవాడ హోటళ్లలోనూ ముందస్తుగా సోదాలు నిర్వహిస్తున్నారు.

cps
cps
author img

By

Published : Aug 27, 2022, 7:24 AM IST

CPS రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలనే డిమాండ్ తో..... ఆందోళనకు సిద్ధమైన ఉద్యోగులను నిలువరించేందుకు....పోలీసులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. చలో విజయవాడ, సీఎం నివాసం ముట్టడిలో పాల్గొనకుండా... సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులకు వ్యక్తిగతంగా నోటీసులిస్తూ.... తహసీల్దార్ల ఎదుట బైండోవర్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఉద్యోగులు పిలిస్తే కిరాయికి వెళ్లవద్దంటూ ప్రైవేటు వాహనదారులకు సూచిస్తున్నారు. విజయవాడ హోటళ్లలోనూ ముందస్తుగా సోదాలు నిర్వహిస్తున్నారు.

సెప్టెంబర్‌ 1న సీఎం ఇంటి ముట్టడి, విజయవాడలో భారీ బహిరంగ సభకు సీపీఎస్‌ సంఘాల పిలుపునిచ్చిన వేళ ...ఉద్యోగులపై పోలీసులు ఆంక్షల విధిస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలకు, ఉద్యోగులకు పోలీసులు నోటీసీలు జారీ చేస్తున్నారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తున్న పోలీసులు...అక్కడే ఉద్యోగులకు చలో విజయవాడ, సీఎం నివాసం ముట్టడి కార్యక్రమాలకు హాజరు కావొద్దంటూ నోటీసులు ఇస్తున్నారు. రెండు కార్యక్రమాలకు ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని.... అనుమతి లేకుండా హాజరుకావటం నేరపూరితమని.... నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరిస్తున్నారు. ఏ కొండూరు మండలం సీపీఎస్ ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమానికి హాజరుకాకూడదంటూ వారికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. 67 మంది సీపీఎస్ టీచర్లకు నోటీసులు అందుకున్నారు.

విజయవాడకు వెళ్లేందుకు బస్సులు, రైళ్లలో ఉద్యోగులు రిజర్వేషన్లు చేయించుకున్నారా అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మరో అడుగు ముందుకేసి ప్రైవేట్ వాహనాల్లోనూ తరలి వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగుల కోసం వెళితే చర్యలు తీసుకుంటామని ప్రైవేటు వాహనదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు.ఉరవకొండలో మొత్తం 55 మందికి నోటీసులు అందించారు. ప్రభుత్వ చర్యలను ఉపాధ్యాయులు తప్పుబట్టారు.

విజయవాడలో ఏసీపీ రమణమూర్తి ఆధ్వర్యంలో గాంధీ నగర్ లో పోలీసులు లాడ్జిల్లో తనిఖీలు చేపట్టారు. ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైనా నగరానికి వచ్చి లాడ్జిలలో బస చేస్తే చెప్పాలంటూ యజమానులకు సూచనలు చేశారు. ఉద్యోగులు తలపెట్టిన నిరసనకు అనుమతి లేదన్నారు.
రమణమూర్తి, విజయవాడ ఏసీపీ

ఉపాధ్యాయులు ఆందోళనలో పాల్గొనకుండా ఉండేందుకు వారంరోజులపాటు వారంరోజులపాటు ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూలు విడుదల చేసింది.

ఇది చదంవండి: ప్రభుత్వంతో సీపీఎస్ ఉద్యోగుల చర్చలు విఫలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.