కృష్ణా జిల్లాలో పోలవరం కుడి కాల్వ తీరు ఆందోళనకరంగా మారింది. పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు అందించే సంకల్పంతో ఐదేళ్ల కిందట ఈ కాల్వను పూర్తి చేశారు. ఇంకా కొంత లైనింగ్ చేయాల్సి ఉంది. వరుసగా అయిదేళ్లు దీని ద్వారా కృష్ణా నదికి నీరు ప్రవహించింది. అధికార యంత్రాంగం పర్యవేక్షణ లేక పోలవరం కుడికాల్వ లైనింగ్ ధ్వంసమైపోయి, పలుచోట్ల కోసుకుపోయింది. కాల్వ గట్లపై మట్టిని విపరీతంగా తరలిస్తుండడంతో కాల్వ పటిష్టత ప్రశ్నార్థకంగా మారుతోంది. దాదాపు 135 కిలో మీటర్ల వరకు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: సెల్ఫీ సూసైడ్: భవనంపై నుంచి దూకి బీటెక్ విద్యార్థి బలవన్మరణం