ETV Bharat / state

జీవో 56ను వెంటనే అమలు చేయాలి: పీజీ వైద్య విద్యార్థుల డిమాండ్

పీజీ వైద్య విద్య కౌన్సిలింగ్‌లో సీట్లు వచ్చిన అభ్యర్థులకు ప్రైవేట్‌ కళాశాలలు ప్రవేశాలకు అనుమతి నిరాకరిస్తున్న పరిస్థితుల్లో.. ఎన్టీఆర్​ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎదుట అభ్యర్థులు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో చర్చించి ప్రవేశాలకు అనుమతించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

జీవో 56ను అమలు చేయాలని వైద్య విద్యార్థుల డిమాండ్

author img

By

Published : Jun 25, 2020, 6:30 PM IST

జీవో 56ను అమలు చేయాలని వైద్య విద్యార్థుల డిమాండ్

పీజీ వైద్య విద్య కౌన్సిలింగ్​లో సీట్లు వచ్చిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల ప్రవేశాలకు అనుమతి నిరాకరిస్తున్న కారణంగా.. విద్యార్థులు విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఎదుట నిరాహారదీక్ష చేపట్టారు.

నాలుగు రోజుల నుంచి దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 56ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవైపు న్యాయపోరాటం చేస్తూనే మరోవైపు దీక్ష చేస్తామని విద్యార్థులు చెబుతున్నారు. ప్రైవేట్ కాలేజీలతో ప్రభుత్వం చర్చించి తమను కాలేజీల్లో చేర్చుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చూడండి:

ఐఐటీల్లో పాఠాలన్నీ ఇక ఆన్​లైన్​లోనే!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.