ETV Bharat / state

Krishna River Bridge issue: వారధి కోసం ఎదురుమొండి ప్రజల 'ఎదురీత' - కృష్ణా నది ప్రజల సమస్యలపై కథనం

Krishna Bridge Issues: అవి కృష్ణా నదిలోని దిబ్బ గ్రామాలు.. 8 వేల మంది ప్రజలు ఉండే ఆ గ్రామాలు సమస్యలకు నిలయాలు. బాహ్యప్రపంచంతో ఎటువంటి సంబంధాలు ఉండవు. ఏ అవసరమొచ్చినా నీటి మీద ప్రమాదకర ప్రయాణాలు చేయాల్సిందే. చుట్టూ నీళ్లతో ఆవరించి ఉండే ఆ ప్రాంతంలో ఒక్క వారధి కనిపించదు. గ్రామాల్లో ఏళ్ల కిందట నిర్మించిన రహదారులు మట్టికొట్టుకుపోయినా పట్టించుకునే వారే ఉండరు. ప్రజాప్రతినిధులు, అధికారులు చుట్టపుచూపుగా వచ్చి, హామీలిచ్చినా అవి వాస్తవరూపం దాల్చవు. సాధారణ జీవితం గడపడానికీ కొట్టుమిట్టాడుతున్న ఆ ప్రజల దీనగాథ తెలుసుకుందామా..?

krishna river Bridge issue
కృష్ణా నది వారధి సమస్యలు
author img

By

Published : Feb 9, 2022, 2:14 PM IST

Krishna Bridge Issues: పులిగడ్డ వద్ద కృష్ణా నది రెండు పాయలుగా విడిపోయి.. ఒకటి హంసలదీవి వద్ద, మరోటి ఎదురుమొండి వద్ద సముద్రంలో కలుస్తాయి. ఎదురుమొండి వద్ద కృష్ణా నది సముద్రంలో కలిసే చోట.. నాగాయలంక మండలం, ఏటిమోగ వద్ద నది మధ్యలో ఉన్న దిబ్బలనే ఎదురుమొండి దీవులు అంటారు. ఎదురుమొండి, నాచుగుంట, బ్రహ్మయ్యగారిమూల, గొల్లమంద, ఏసుపురం, ఈలచెట్లదిబ్బ, జింకపాలెం గ్రామాలు ఇక్కడ ఉన్నాయి. వీటిలో సుమారు 8 వేల మంది ప్రజలు ఇక్కడ స్థిర నివాసం ఉంటున్నారు. 3,756 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ దీవుల్లో 1,985 కుటుంబాలకు బాహ్య ప్రపంచంతో ఉన్న ఏకైక మార్గం పంటు ప్రయాణం. అంతకు ముందు వరకు నాటు పడవలే దిక్కుగా ఉండేవి.

కృష్ణా నది వారధి సమస్యలు

ప్రైవేటు పంటులతోనే ప్రయాణం

గతంలో ప్రభుత్వ సహకారంతో ఎదురుమొండి దీవులకు స్థానిక గ్రామ పంచాయతీ నిర్వహణలో ఓ పంటు ఏర్పాటు చేశారు. కొన్నాళ్లకు సముద్రం నుంచి వచ్చిన రాకాసి అలల ధాటికి అది రెండు ముక్కలైంది. అప్పటి నుంచి ప్రైవేటు పంటు మాత్రమే వారికి ఆధారంగా మారింది. ప్రజల రవాణాకే కాదు, ద్విచక్రవాహనాల నుంచి వడ్లు మోసుకెళ్లే లారీలు, ట్రాక్టర్ల వరకు ఏ వాహనాన్ని ఒడ్డు దాటించాలన్నా ఈ పంటు మాత్రమే వారికి సాధనంగా ఉపయోగపడేది. ఏ క్షణాన ఏ ఉపద్రవం వచ్చిపడుతుందోననే భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు.

వారధి నిర్మాణంతోనే సమస్యల పరిష్కారం...

ఎదురుమొండి, ఏటిమోగల మధ్య వారధి నిర్మాణంతో ఇక్కడి ప్రజల సమస్యలు చాలా వరకు గట్టెక్కుతాయి. బాహ్యప్రపంచంతో సంబంధాలు మెరుగవుతాయి. ఈ బ్రిడ్జిని నిర్మిస్తామంటూ చాలా ఏళ్లుగా ప్రభుత్వాలు, రాజకీయ పక్షాలు హామీ ఇస్తున్నా, నిర్మాణానికి మాత్రం నోచుకోవడం లేదు. చిన్న వయసు నుంచీ హామీలు వింటూ వస్తున్నామని, జీవితంలో వారధిని చూస్తామనే ఆశ లేదని అక్కడి ప్రజలు అంటున్నాురు. కృష్ణా నది ఆటుపోట్లు, వరదలకు పక్కనే ఉన్న రహదారి కోతకు గురవుతోంది. దీనివల్ల ప్రయాణం మరింత ప్రాణాంతకంగా మారింది. తాగునీరు నాలుగురోజులకోసారి సైతం సరిగా అందడం లేదు. అవి కూడా సముద్రం నీటిలా ఉప్పగా ఉంటుండటంతో కిలోమీటర్ల పాటు నడిచి మంచి నీరు తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జనసేన నాయకుల పర్యటన..

ఎదురుమొండి గ్రామాల్లో సోమవారం జనసేన నాయకులు పర్యటించారు. అక్కడి స్థానికులతో సమస్యలపై చర్చించారు. జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు గొల్లమందకు వెళ్లే రహదారిని పరిశీలించి వెళ్లారని, ఇప్పటికీ పనులు మొదలుపెట్టలేదని జనసేన నేతలతో స్థానికులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఇతర సమస్యలన్నీ వివరించారు.

ఇదీ చదవండి:ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన... రాష్ట్రప్రభుత్వాలకు కొత్త మార్గదర్శకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.