మీరు ఉంటున్న ఊళ్లోనే ఉద్యోగాలిస్తాం.. నెలకు రూ.25 వేల జీతం వస్తుంది. అయితే ప్రాసెస్ ఫీజు కోసం కొంత నగదు చెల్లించాలంటూ అమాయకుల నుంచి కోట్ల రూపాయల్లో నగదు వసూలు చేశారు ఆ కేటుగాళ్లు. ఉద్యోగాలు వచ్చేశాయి... శిక్షణ పూర్తి అయిన వెంటనే విధుల్లో చేరడమేనంటూ బాధితులను విజయవాడకు పిలిచారు. శిక్షణ వాయిదా వేశారు. అనుమానం వచ్చిన బాధితులు కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కన్సల్టెంట్ ఏర్పాటు చేసి..
నగరంలో గ్లోబల్ ఫెసిలిటీ పేరుతో ఓ కన్సలెంట్ సంస్థను ఏర్పాటు చేసి.. బీఎస్ఎన్ఎల్ టవర్స్ నిర్వహణకు ఉద్యోగస్తులు కావాలంటూ ప్రచారం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అభ్యర్థులను ఎంపిక చేశారు. మీ ఊళ్లోనే టవర్స్ ఏర్పాటు చేస్తున్నాం.. అక్కడే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చని నమ్మించారు. ప్రాసెస్ ఫీజు కింద రూ.25 వేల నుంచి 4 లక్షల వరకు నగదు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటి వరకు 40 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే గ్లోబల్ ఫెసిలిటీ కంపెనీ హైదరాబాద్‌లో మరో కంపెనీకి అనుబంధంగా ఏర్పాటు చేశారని దర్యాప్తులో తెలినట్లు వారు వివరించారు. సంస్థ నిర్వాహకులు కిషోర్ రెడ్డి , రవివర్మ, శ్రీనివాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
ఇదీ చదవండి: