ETV Bharat / state

జేబులు ఖాళీ చేస్తున్న సైబర్ నేరగాళ్లు... అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు - online trading cheating at vijayawada news

మీరు ఆన్ లైన్ ట్రేడింగ్​లో పెట్టుబడి పెట్టండి..15 రోజుల్లో రెట్టింపు ఆదాయం పొందండి అంటూ మేసేజ్ పెడతారు. ఆ మాటలు నమ్మి పెట్టుబడి పెట్టారో.. మీ జేబులు ఖాళీ చేస్తారు సైబర్ నేరగాళ్లు. ఈ తరహా సైబర్ నేరాలు ఒకెత్తు అయితే... వైద్య సీట్లు తక్కువ ధరలకు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడే వారు మరికొందరు. ఇలాంటి మాయమాటలకు లొంగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

cyber crime
జేబులు ఖాళీ చేస్తున్న సైబర్ నేరగాళ్లు... అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
author img

By

Published : Dec 1, 2020, 5:09 PM IST

జేబులు ఖాళీ చేస్తున్న సైబర్ నేరగాళ్లు... అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

ఒక్క సమాచారం (మేసేజ్​)తో మీ జేబులు ఖాళీ చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. అప్రమత్తంగా లేకుంటే నిలువుదోపిడీ చేసే కేడీలు పుట్టుకొస్తుంటారు. సైబర్ నేరగాళ్లు మనిషి బలహీనతల్ని ఆసరాగా చేసుకుని కుచ్చుటోపీ పెడుతున్నారు. మీరు పెట్టుబడి పెట్టండి 15 రోజుల్లో రెట్టింపు నగదు పొందండి... అంటూ అమాయకులకు ఎరవేసి మోసం చేస్తున్నారు.

సాఫ్డ్​వేర్ నుంచి రూ.32లక్షలను దోచేశారు

విజయవాడలో తాజాగా ఈ తరహాలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ నుంచి రూ.32 లక్షల నగదును దోచేశారు. ఇబ్రహీంపట్నంకు చెందిన ఓ యువకుడు బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఇంటి నుంచే తన విధులు నిర్వహిస్తున్నాడు. మీరు ఆన్​లైన్ ట్రేడింగ్​లో పెట్టుబడి పెట్టండి అనతి కాలంలోనే మీకు రెట్టింపు వస్తుందని మెసేజ్ వచ్చింది. దీంతో సంబంధిత లింక్ ను క్లిక్ చేయగానే ఎక్సెల్ ఏసియా 8 అనే వెబ్ సైట్ తెరుచుకుమది. దాంట్లో పూర్తి వివరాలు అప్ లోడ్ చేయగానే ఖాతా ప్రారంభమవుతుందని తెలిపారు.

అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు

బాధితుడు ఆన్ లైన్​లో అన్నీ వివరాలను తెలిపాడు. ఓ బ్యాంక్ ఖాతా నెంబర్ ఇచ్చి నగదు వేయాలని తెలిపారు. వెంటనే బాధితుడు ఆ ఖాతాలో నగదు వేశాడు. 15 రోజుల తర్వాత నగదును రెట్టింపు చేస్తూ వెబ్​సైట్ లో చూపాడు. అది చూసి బాధితుడు నమ్మి మరోసారి నగదు చెల్లించాడు. అలా విడతల వారీగా రెండు నెలల పాటు రూ.32 లక్షలను చెల్లించాడు. నగదు కావాలని కోరగా రూ.60 లక్షలు వచ్చిన తర్వాత ఇస్తామని నిందితుడు చెప్పటంతో... అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్యాంక్ ఖాతాల ఆధారంగా వివరాలు తెలుసుకున్నారు. హర్యానా, గుజరాత్​కు చెందిన ఖాతాలుగా గుర్తించారు. బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదును సీజ్ చేశారు.

పోలీసుల సూచనలు

స్టాక్ ఎక్సేంజ్​లో పెట్టుబడి పెట్టాలంటే ముందుగా డీమాట్ ఖాతా తెరవాలి. ఎక్సేంజ్ చేసే ఏజెంట్లు కేవలం సూచనలు మాత్రమే చేస్తారని... తన వద్ద నగదు ఉంచుకోరని పోలీసులు సూచిస్తున్నారు. ప్రజల్లో ఉన్న బలహీనతలను అవకాశంగా తీసుకుని ఈ విధంగా సైబర్ నేరగాళ్లు దోపిడీకి పాల్పడతున్నారని పోలీసులు చెపుతున్నారు.

మరో ఘటన: పీజీ వైద్య సీటు ఇప్పిస్తానంటూ టోకరా

తక్కువ ఫీజుకే పీజీ మెడికల్ సీటు ఇప్పిస్తామంటూ ఆశచూపి... రూ.60లక్షలు వసూలు చేసిన ఘటన నగరంలో వెలుగు చూసింది. విజయవాడకు చెందిన ఓ యువతి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ముంబయ్​లోని డీవై పాటిల్ డీమ్డ్ యూనివర్శటీలో పీజీ న్యూరాలజీ చేయటానికి సీటు ఇప్పిస్తానని ఓ మధ్యవర్తి మాయమాటలు చెప్పాడు. ఆ మాటలు నమ్మిన యువతి రూ.60 లక్షలు మధ్యవర్తికి ఇచ్చింది. యూనివర్శిటీ పేరుపై డీడీ తీసి యువతికి ఇచ్చాడు. యువతి యూనివర్శిటీ వద్దకు వెళ్లి తన సీటు గురించి అధికారులను అడడగా... సీట్లు ఎప్పడో భర్తీ అయ్యాయని తెలపారు. మోసపోయాయని గుర్తించిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.

పోలీసులు దర్యాప్తు ప్రారంభించి మొదట బ్యాంక్ అధికారులకు సమాచారమందించి డీడీని కాన్సిల్ చేయించారు. అనంతరం వర్శిటీ అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. బ్యాంక్ ఖాతాలో నగదును సీజ్ చేసి బాధితురాలికి అందజేశారు. కోటి రూపాయల విలువ చేసే వైద్య సీట్లను తక్కువ ధరలకు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేస్తున్నారు. ఇలాంటి వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:

వ్యసనాలకు బానిసై దొంగతనాలు...ఐదుగురు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.