ETV Bharat / state

తెలంగాణ... బావిలో ఐదు మృతదేహాలు లభ్యం - deadbodies in gorrekunta well

తెలంగాణ రాష్ట్రం వరంగల్ గ్రామీణ‌ జిల్లాలోని గొర్రెకుంట బావిలో ఈ రోజు ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇప్పటి వరకు ఆ బావిలో తొమ్మిది శవాలు దొరికాయి.

deadbodies found in gorrekunta well
తెలంగాణ గొర్రెకుంట బావిలో ఐదు మృతదేహాలు లభ్యం
author img

By

Published : May 22, 2020, 6:26 PM IST

తెలంగాణ రాష్ట్రం వరంగల్ గ్రామీణ‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలోని బావిలో ఈ రోజు మరో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. 21వతేదీన గొర్రెకుంటలోని బావిలో 4 మృతదేహాలను కనుగొన్న పోలీసులు... నేడు మరో ఐదుగురిని వెలికి తీశారు. నిన్న వెలికితీసిన మృతుల్లో మక్సుద్, ఆయన భార్య నిషా, కుమార్తె బుస్రు, మక్సుద్ మనవడు ఉండగా... ఈ రోజు వెలికితీసిన వారిలో మరో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.

మృతదేహాల్లో షకీల్ వరంగల్ వాసిగా... శ్రీరామ్​ బిహార్ వాసిగా గుర్తించారు. 20 ఏళ్ల క్రితం బంగాల్‌ నుంచి వచ్చి వరంగల్‌లో స్థిరపడిన కుటుంబమని స్థానికులు తెలిపారు. లాక్​డౌన్ కారణంగా రెండు నెలల నుంచి పనులు లేవని... అప్పటి నుంచి గోదాంలోనే గోనే సంచులు కుడుతున్నారని స్థానికులు పేర్కొన్నారు. మొన్న సాయంత్రం కూడా వీరు పనికి వచ్చారని... నిన్న ఉదయం నుంచి కనిపించకపోవడంతో అన్ని చోట్ల వెతకగా... బావిలో కనిపించారని తెలిపారు.

ఎన్నో అనుమానాలు...

అక్కడే పని చేస్తున్న బిహారి యువకులు సైతం కనిపించట్లేదని... వారికి ఈ ఘటనకు ఏమైనా సంబంధం ఉన్న అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఇవన్నీ సామూహిక హత్యలా..? సామూహిక ఆత్మహత్యలా అనే విషయం తెలియాల్సి ఉంది. మృతుల్లో ఓ బిహారి యువకుడు కూడా ఉండడంతో కేసుపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్​ వచ్చాక మిగిలిన విషయాలు తెలియాల్సి ఉంది. ఇంకా బావిలో మృతదేహాలు ఉండవచ్చనే అనుమానంతో వరంగల్ విపత్తు నిర్వహణ బృందం సభ్యులు బావిలోని నీటిని పూర్తిగా తోడేస్తున్నారు. ఈ ఘటనపై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించి... తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తెలంగాణ గొర్రెకుంట బావిలో ఐదు మృతదేహాలు లభ్యం

ఇదీచూడండి. పట్టపగలే ...ఆర్టీసీ డిపోలో బస్సును కొట్టేశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.