కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తన కుమారుడిని అడ్డుపెట్టుకొని భూమిని కాజేయాలని చూస్తున్నాడని పెనమత్స గ్రామానికి చెందిన మల్లేశ్వరి రాణి అనే వృద్ధురాలు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని పోలీసుల వద్దకు వెళ్లినా...పట్టించుకోవటం లేదని మీడియా ముందుకు వచ్చారు.
ప్రశ్నిస్తే దాడి..
తనకున్న ఎకరం పొలంలో పండిన పంటను ఎమ్మెల్యే అండదండలతో తన కుమారుడు చంద్రశేఖర్ రావు దౌర్జన్యంగా దోచుకెళ్లాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమని ప్రశ్నిస్తే కొడుకు, కోడలు కలిసి తనపై దాడికి ప్రయత్నిస్తున్నారని వాపోయారు.
ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అండదండలతోనే తన కుమారుడు ఇలా చేస్తున్నాడని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎమ్మెల్యే కనుసన్నల్లో నడుస్తూ ఫిర్యాదు స్వీకరించటం లేదని ఆరోపించారు. తన భూమిని ఎమ్మెల్యే కబ్జా చేయాలని చూస్తున్నాడని.. రక్షణ కల్పించాలని ఆమె వేడుకుంటున్నారు.
ఇదీచదవండి
కెరీర్ చివరిలో ఇలాంటి పిటిషన్ ఎదుర్కోవాల్సి వచ్చింది: జస్టిస్ రాకేష్ కుమార్