కృష్ణా జిల్లా నున్నలో జరిగిన వృద్ధురాలి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్య, దోపిడీకి పాల్పడింది హరియాణా ముఠాగా పోలీసులు భావిస్తున్నారు. విజయవాడ పరిసరాల్లో నిందితుల కోసం ఐదు సీసీఎస్ బృందాలు గాలింపు చేపట్టాయి. అనుమానం ఉన్నవారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
4 రోజుల క్రితం దారుణ హత్య
విజయవాడ నగర శివారు కుందా వారి కండ్రికలో ఈనెల 27న ఇంటి ముందు కూర్చొని ఉన్న వృద్దురాలు సుబ్బమ్మపై గుర్తు తెలియని ఆగంతకులు దాడి చేసి..నగలు దోచుకెళ్లారు. తీవ్రగాయల పాలైన సుబ్బమ్మను స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. సీసీఎస్, నున్న గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి