విజయవాడలో జరిగిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ వృద్ధుడు తినుబండారాలతో లోబరుచుకుని బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అజిత్‌సింగ్ నగర్‌కు చెందిన అచ్చయ్య కొన్ని రోజుల క్రితం పాఠశాలకు వెళ్లే బాలికను మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కొన్ని రోజులకు బాలిక గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి