రైతుల నుంచి వసూలు చేసే నీటి తీరువాను పెంచాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. మాగాణికి ఎకరానికి గరిష్ఠంగా 400, పండ్ల తోటలకు 700, రొయ్యల చెరువులకు 1500 రూపాయల చొప్పున వసూలు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఆరుతడి పంటలు వేసే భూములకూ ఇప్పుడున్న పన్నును రెట్టింపు చేయాలని సూచించారు. ఆ పెంపు వల్ల ఏడాదికి 460 కోట్ల రూపాయల మేర ఆదాయం సమకూరుతుందని... ఇందులో అత్యధికంగా ఖరీఫ్‌లోనే 275 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల కింద సాగుకు అవకాశం ఉన్న భూమి 1.33 కోట్ల ఎకరాలు ఉన్నట్లు కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(కాడా) అంచనా వేసింది.
ఇదీ చదవండి