ETV Bharat / state

నిరాడంబరంగా.. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు - ఎన్టీఆర్ పుట్టినరోజు తాజా వార్తలు

రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు నిరాడంబరంగా జరిపారు. పేదలకు అన్నదానం చేశారు.

NTR birthday celebrations
నిరాడంబరంగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు
author img

By

Published : May 20, 2021, 2:00 PM IST

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు చిరుమామిళ్ళ శ్రీనివాసరావు.. నందిగామలో ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో నందిగామ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, తదితరులు పాల్గొన్నారు. నటనలో తాతను మైమరిపిస్తూ.. అభిమానుల హృదయల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నరంటూ.. అభిమానం చాటుకున్నారు.

కర్నూలులో...

కర్నూలులో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును అభిమానులు వేడుకగా నిర్వహించారు. టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం, అన్నదానం చేశారు. కొవిడ్ సమయంలో రక్తదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని టీం తారక్ ట్రస్టు కోఆర్డినేటర్ శేఖర్ చౌదరి అన్నారు. ఈసందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు కేక్ కట్ చేశారు.

తూర్పు గోదావరి జిల్లాలో...

ఆలమూరులో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును సందడిగా నిర్వహించారు. కోవిడ్ బాధితులకు, పారిశుద్ధ్య కార్మికులకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ మురళీకృష్ణ సంస్థల అధినేత వంటిపల్లి పాపారావు తనయుడు వంటిపల్లి మురళీకృష్ణ ఆధ్వర్యంలోని బస్టాండ్ సెంటర్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు. పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు అందజేశారు. కొవిడ్ బాధిత కుటుంబాలకు, పోలీసులకు భోజనం ప్యాకెట్లు, కోడిగుడ్లు పంపిణీ చేశారు.

ఇవీ చూడండి:

గ్రామాల్లోనూ.. కొవిడ్‌ మినీ సంరక్షణ కేంద్రాలు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.