కృష్ణా జిల్లా పామర్రులో నివర్ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటం వల్ల రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరిపంటకు తీవ్ర నష్టం వాటిల్లుతందని వాపోతున్నారు. ఇప్పటికే కోతలు కోసిన వరి పొలంలోనే ఉందని వర్షం కారణంగా మెులకలు వచ్చే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
నగరంలో ఉదయం నుంచి వర్షం
నివర్ తుపాను ప్రభావంతో విజయవాడ నగరంలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. పలుచోట్ల రహదారులపై నీళ్లు నిలిచిపోవడంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంత కాలనీలు జలమయమయ్యాయి.
పంటపొలాల్లో భారీగా నీరు
దివి సీమలో రాత్రి నుండి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. కోత కోయని వరి పొలాల్లో నీరు భారీగా చేరుకుంది. మెట్ట ప్రాంతాల్లో టమాట, మిరప, కంద, పసుపు ఇతర కూరగాయల తోటల్లో వర్షపు నీరు నిలిచాయి.
ఇదీచదవండి