niti aayog to krishna district: కృష్ణా జిల్లాలోని ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించేందుకు నీతి ఆయోగ్ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్వరరావు ఆధ్వర్యంలోని ఏడుగురు సభ్యుల బృందం నేడు రాష్ట్రానికి రానుంది. తొలుత దిల్లీ నుంచి విమానంలో గన్నవరం చేరుకుంటారు. అక్కడినుంచి వీరపనేనిగూడెం వెళ్తారు. అక్కడ తెల్లం విజయ్ కుమార్ అనే రైతుతో సమావేశమై ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన అంశాలను తెలుసుకుంటారు. తర్వాత వ్యవసాయ క్షేత్రాలను పరిశీలిస్తారు.
niti aayog in AP: మధ్యాహ్నం విజయవాడలో ముఖ్యమంత్రి, వివిధ శాఖల అధికారులను నీతి ఆయోగ్ సభ్యుల బృందం కలుస్తుంది. సాయంత్రం నాలుగున్నర గంటలకు పారిశ్రామిక సంఘాలతో సమావేశమవుతారు. ఐదున్నరకు వివిధ వర్సిటీలో వైస్ ఛాన్స్‌లర్లు, విద్యా సంస్థల ప్రతినిధులు, సామజిక సంఘాల ప్రతినిధులతో భేటీ అవుతారు. నీతి ఆయోగ్ బృందం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ నివాస్ పరిశీలించారు. గురువారం (డిసెంబర్ 2) ఉదయం గన్నవరం నుంచి విమానంలో దిల్లీ బయలుదేరి వెళ్తారు.
ఇదీ చదవండి: