జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఐఏఎస్ అధికారి నీరబ్‌కుమార్ ప్రసాద్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం అటవీ, పర్యావరణ శాఖలు నిర్వహిస్తున్న నీరబ్‌కుమార్ ప్రసాద్‌కు ఆర్థికశాఖ అప్పగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అటవీ, పర్యావరణ శాఖల బాధ్యతలు ఆదిత్యనాథ్ దాస్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిత్యనాథ్ దాస్ ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
త్వరలోనే..
సీఎంవో ముఖ్య కార్యదర్శిగా ఎస్.ఎస్.రావత్‌ను నియమించే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఇందుకు సంబంధించిన బదిలీ ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నట్లు సమాచారం.