హైకోర్టు, అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు... ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి డాక్టర్.కృపాసాగర్ తెలిపారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యంగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉదయం 10.30 గంటలకు నేలపాడులోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.కె.మహేశ్వరి, ఇతర న్యాయమూర్తులు పాల్గొని లోక్ అదాలత్ నిర్వహిస్తారని తెలిపారు. ప్రజల్లో న్యాయపరమైన అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: గతంలో ఉన్న ధర్మకర్తల మండళ్లు కొనసాగనివ్వండి:హైకోర్టు