కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌పై జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. కొల్లేరు సరస్సుకు జరుగుతున్న నష్టంపై నివేదిక సమర్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. జీవవైవిధ్యం, జల జీవనం కోల్పోతున్న వ్యవహారాలపై గతేడాది ఎన్జీటీ నివేదిక కోరింది.
'గతేడాది ఇచ్చిన మేం ఇచ్చిన ఆదేశాలను అలసత్వం చేశారు. ఏడాదిపైగా గడిచినప్పటికీ నివేదిక ఇవ్వకపోవడం ఏమిటి?. నివేదికను ఇవ్వడానికి మీకు చివరి అవకాశాన్ని ఇస్తున్నాం. కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా మేజిస్ట్రేట్‌లతో కూడిన కమిటీ నివేదిక ఇవ్వాలి. నివేదిక ఇవ్వకుంటే తగిన చర్యలుంటాయి' అని ఎన్జీటీ త్రిసభ్య ధర్మాసనం... కృష్ణా జిల్లా కలెక్టర్‌ను హెచ్చరించింది. కేసు తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 5కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి
కార్గిల్ ప్రత్యేకం: మంచు శిఖరంపై మరపురాని విజయానికి 21 వసంతాలు