ETV Bharat / state

తెలుగు రాష్ట్రాల్లో విగ్రహాలు ధ్వంసం చేస్తున్న ముఠా అరెస్ట్ - తెలుగు రాష్ట్రాల్లో విగ్రహాలు ధ్వంసం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన నందిగామ పోలీసులు

రెండు తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాల్లో.. విగ్రహాలను ధ్వంసం చేస్తున్న ముఠాను నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పురాతన విగ్రహాల్లో వజ్రాలు, ఆభరణాలు ఉంటాయనే మూఢనమ్మకంతో.. వారు ఈ చర్యలకు పాల్పడుతున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ, సిట్ అధికారి డీఐజీ అశోక్ కుమార్ తెలిపారు. వీరి ద్వారా ఆలయాల్లో దాడులు చేస్తున్న ముఠా వివరాలు రాబట్టామని వెల్లడించారు.

Breaking News
author img

By

Published : Jan 22, 2021, 11:03 PM IST

గుప్తనిధుల కోసం దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేసే ముఠాను నందిగామ పోలీసులు అరెస్ట్ చేశారు. సిట్ అధికారి డీఐజీ అశోక్ కుమార్, కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు.. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. మూఢనమ్మకాలతో పురాతన ఆలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేస్తున్న.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

మక్కపేటలో అపహరణ వీరి పనే...

వత్సవాయి మండలం మక్కపేటలో ఉన్న అతి పురాతనమైన కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో.. గతేడాది సెప్టెంబర్ 16న నంది విగ్రహం చెవులను ఈ గ్యాంగ్ అపహరించి ఎర్రగట్టు తీసుకెళ్లారని ఎస్పీ తెలిపారు. చెవిలో వజ్రాలు ఉన్నాయని భావించిన నిందితులు వాటిని పగలగొట్టి చూశారని.. వాటిలో ఏమీ లేకపోవడంతో హైదరాబాద్ వెళ్లిపోయారని తెలిపారు. ఈ విగ్రహాన్ని తిరిగి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా ఏడుగురుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

దాడులు ముఠా వివరాలు సేకరించాం...

తెలుగు రాష్ట్రాల్లోని తొమ్మిది ఆలయాల్లో విగ్రహాలు దోపిడీకి ఈ ముఠా రెక్కీ నిర్వహించిందని రవీంద్రనాథ్ బాబు తెలిపారు. పురాతన ఆలయాల్లోని విగ్రహాల్లో వజ్రాలు, ఇతర ఆభరణాలు ఉంటాయని భావించి.. ఈ తరహా ఘటనలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఆలయాల్లో దాడులకు పాల్పడే వారి వివరాలను.. ఈ ముఠా నుంచి సేకరించినట్లు చెప్పారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామన్నారు.

ఇదీ చదవండి:

బందరు కాలువలో ఇద్దరు చిన్నారుల గల్లంతు..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.