విజయవాడలో మైత్రి పేరిట రూపొందించిన ఓ రోబోను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆవిష్కరించారు. సర్క్యూట్ గ్రిడ్ ఎలక్ట్రానిక్స్, హర్ష అకాడమీ సంయుక్తంగా ఈ రోబోను రూపొందించారు. దీన్ని హైదరాబాద్‌కు చెందిన 'సర్క్యూట్ గ్రిడ్ ఎలక్ట్రానిక్స్ ' చైర్మన్ ఫణికుమార్ ఆధ్వర్యంలో ఆ సంస్థ టెక్నికల్ హెడ్ దుర్గాప్రసాద్ తయారుచేశారు. ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న కరోనా భాధితుల సహాయార్థం దీన్ని రూపొందించినట్లు దుర్గాప్రసాద్ తెలిపారు.
కలెక్టర్ ఇంతియాజ్‌కు హర్ష అకాడమీ డైరెక్టర్ తనూజ్ కుమార్ మైత్రిని అందజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యసేవలకు ఎంతగానో ఉపయోగపడే దీన్ని తయారు చేసినందుకు కలెక్టర్ అభినందించారు. కృష్ణా జిల్లాలో 2 రోబోలను ఉచితంగా అందించారని చెప్పారు. ఈ మైత్రి రోబో వైఫై ద్వారా పనిచేస్తుందని.. 20 అడుగుల దూరం నుంచి మొబైల్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేస్తూ రోగులకు ఆహారం, మందులు అందించవచ్చని తెలిపారు. తద్వారా వైద్య సిబ్బంది వైరస్ బారిన పడకుండా కాపాడవచ్చన్నారు.
ఇవీ చదవండి.. 'అలా చేయకపోతే ఉద్యోగం ఉండదు... జాగ్రత్త!'