మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మండిపడ్డారు. తన పదవీ కాలంలో ఏమీ చెయ్యలేక ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. మైలవరంలోని ఎస్సీ కాలనీలో అంతర్గత రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. దూరదృష్టితో ముఖ్యమంత్రి రాజధాని వికేంద్రీకరణ చేస్తున్నారని... దానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి దేవినేనికి మాటలు రావడం లేదని అన్నారు. తనను రాజీనామా చేయాలని అడగటం ఉమా వక్ర బుద్ధి రాజకీయాలకు నిదర్శనం అని ఆరోపించారు. వ్యక్తిగత దూషణలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఇదీ చదవండి: