తన రాజకీయ పునాదులు కదిలిపోతున్నాయనే భయంతోనే మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అసత్య ఆరోపణలకు దిగుతున్నారని మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ ఎద్దేవా చేశారు. అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా వంటి ప్రతి విషయాన్ని తనకు ఆపాదిస్తూ అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కేతనకొండ తెదేపా ఎంపిటీసీ అభ్యర్థి, గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమ్మూరు గోపాలరావు అక్రమంగా మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన విషయాన్ని గమనించాలన్నారు. చట్టం తన పని తాను చేస్తుందని, తమకు ఎవరైనా సమానమేనని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి