ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు మున్నేరుకు వరద పోటెత్తింది. 14వ తేదీన మొదలైన వరద ఏకధాటిగా నాలుగు రోజులు కొనసాగింది. దశాబ్ద కాలం తర్వాత మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. నదిలో రెండు రోజులపాటు రోజుకి 1.16 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. వరద ఉద్ధృతికి కృష్ణా జిల్లా లింగాల వద్ద వంతెనపై ఉన్న తాగునీటి పథకాల పైపులైన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ కారణంగా గడచిన నాలుగు రోజులుగా 13 గ్రామాలకు తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. బుధవారం వరద తగ్గుముఖం పట్టడంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ధ్వంసమైన పైపులైన్లు పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన పైప్ లైన్ మరమ్మతులు చేపడతామని తెలిపారు.
ఇదీ చదవండి : రేపట్నుంచి గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు.. నిర్వహణపై మంత్రి సమీక్ష