Municipal Teachers Protest: రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పురపాలక ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. పాఠశాలల విలీనాన్ని వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రభుత్వ చర్యలతో 2115 పురపాలక పాఠశాలల్లో మిగిలేది 335 పాఠశాలలే అని ఆందోళన వ్యక్తం చేశారు.
3 కి.మీ. దూరంలోని పాఠశాల విలీనంతో 80 శాతం బడులు మూసివేసే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో మైనారిటీ పిల్లలకు ప్రభుత్వ విద్య దూరమయ్యే అవకాశం ఉందన్నారు. 9 వేల పురపాలక టీచర్ల పరిస్థితి ఆగమ్యగోచరం కానుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: