ETV Bharat / state

రాజ్​నాథ్​ను కలిసిన ఎంపీ రఘురామ.. కేపీరెడ్డిపై విచారణ చేయించాలని విజ్ఞప్తి - MP Raghurama, who met Rajnath, appealed for an inquiry into KP Reddy role at Secunderabad Army Hospital

తెలంగాణలోని సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి తనను బలవంతంగా డిశ్చార్జ్ చేశారని ఆరోపిస్తూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్​కు ఎంపీ రఘురామ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేపీ రెడ్డి పాత్రపై విచారణకు ఆదేశించాలని కోరారు.

రాజ్​నాథ్​ను కలిసిన ఎంపీ రఘురామ.. కేపీరెడ్డిపై విచారణ చేయించాలని విజ్ఞప్తి

author img

By

Published : May 31, 2021, 4:27 AM IST

Updated : May 31, 2021, 5:09 AM IST

సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి నుంచి తనను తొందరగా డిశ్ఛార్జి చేయాలని ఆస్పత్రి రిజిస్ట్రార్‌ కేపీ రెడ్డి వైద్యులపై ఒత్తిడి తెచ్చారని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు ఫిర్యాదు చేశారు.

సీఐడీ, ఆర్మీ ఆస్పత్రి తీరుపై ఫిర్యాదు..

ఆదివారం దిల్లీలో రాజ్‌నాథ్​ను కలిసిన రఘురామ.. సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు, ఆర్మీ ఆస్పత్రిలో జరిగిన ఘటనలను వివరించారు. తితిదే జేఈవో ధర్మారెడ్డి, గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డితో కలిసి కేపీ రెడ్డి చేసిన కుట్రతో ఆస్పత్రి నుంచి తనను బలవంతంగా డిశ్చార్జ్ చేయించి పోలీసులు పట్టుకునేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో కేపీ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని ఎంపీ రఘురామ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి : Cm Jagan : 14 వైద్య కళాశాలల నిర్మాణానికి నేడు సీఎం జగన్ శంకుస్థాపన

Last Updated : May 31, 2021, 5:09 AM IST

For All Latest Updates

TAGGED:

RR-RAJNATH
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.