ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని విజయవాడలో ప్రారంభించారు. గుణదల బిషప్ గ్రేస్ పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు.... కృష్ణా జిల్లా పరిపాలన అధికారి ఇంతియాజ్ లాంఛనంగా ఈ కార్యక్రమానికి ప్రారంభించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ... పుట్టే బిడ్డకు తల్లిపాలు పట్టించటం వల్ల వ్యాధులను దూరం చేయవచ్చు అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కృష్ణాజిల్లా శిశు సంక్షేమ శాఖ పలు కార్యక్రమాలు చేపడుతందని కొనియాడారు. తల్లిపాల వారోత్సవాలు కార్యాచరణ రూపొందించి, మహిళలకు అవగాహన కార్యక్రమం శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టినట్టు కృష్ణా జిల్లా పరిపాలన అధికారి ఇంతియాజ్ తెలిపారు. అప్పుడే పుట్టే చిన్నారులకు ఎటువంటి వ్యాధులు రాకుండా తల్లిపాలు చక్కగా ఉపయోగపడతాయని అన్నారు.
ఇదీ చూడండి తిరుమలకు మద్యం, మాంసం.. తమిళుడి నిర్వాకం!