ETV Bharat / state

పేరుతో ఏమార్చి.. లక్ష రూపాయలకు టోకరా - cyber cheating news

సైబర్ నేరగాళ్లు నగదు దోచటానికి కొత్తకొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఫేస్​బుక్​లో నకిలీ ఖాతాలు తెరిచి.. దాని ద్వారా నగదు కావాలని రిక్వెస్టులు పంపిస్తున్నారు. ఇలా ఓ మోసగాడి బారిన పడి విజయవాడకు చెందిన వ్యక్తి నగదు పోగట్టుకున్నాడు.

money cheating on facebook
సైబర్ మోసం
author img

By

Published : Sep 16, 2020, 8:38 PM IST

Updated : Sep 17, 2020, 2:01 PM IST

పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలకు చెందిన వ్యక్తుల పేర్లతో ఫేస్​బుక్​లో నకిలీ ఖాతాలు తెరచి..అత్యవసరంగా నగదు కావాలంటూ రిక్వెస్ట్​లు పంపి నగదు దోచుకుంటున్నారు. తాజాగా ఇటువంటి సంఘటన విజయవాడలో వెలుగుచూసింది . అజిత్​సింగ్ నగర్ పీఎస్ పరిధిలో ఉంటున్న... బాలగురుప్రసాద్ రెడ్డి సిటీ గార్డ్స్ అనే ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో హెడ్ కానిస్టేబుల్​గా పని చేస్తున్నారు. అదే సెక్యూరిటీ సంస్థలో ఎస్సై స్థాయిలో పని చేస్తున్న జయన్న అనే వ్యక్తి పేరుపై ఫేస్​బుక్​లో... తనకు అత్యవసరంగా లక్ష రూపాయలు నగదు కావాలని ఓ మెస్సేజ్ వచ్చింది. దీనితో గురుప్రసాద్ లక్ష రూపాయల నగదును పంపేందుకు సిద్ధమై..ఫోన్ చేసేందుకు ప్రయత్నించాడు. ఫోన్ కలవకపోవటంతో తెలిసిన వ్యక్తే కదా అని లక్ష రూపాయలను రెండు దఫాలుగా ఆన్​లైన్​ ద్వారా పంపించారు. అనంతరం జయన్నకు ఫోన్ చేసి నగదు అందాయా లేదా అని ఫోన్ చేయగా.. తనకు నగదు గురించి తెలియదని సదరు వ్యక్తి సమాధానం చెప్పాడు. దీంతో మోసపోయానని బాధితుడు అజిత్​సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని.. డిజిటల్ ఆధారాల కోసం కేసును సైబర్ క్రైమ్​ పోలీసులకు పంపించారు.

ఇదీ చదవండి: 'అధికారం శాశ్వతం కాదు.. గుర్తు పెట్టుకోండి'

Last Updated : Sep 17, 2020, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.