ETV Bharat / state

'దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు' - mailavaram market yard latest news update

దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రైతులకు సూచించారు. కృష్ణా జిల్లా మైలవరం స్థానిక మార్కెట్ యార్డ్​లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

MLA Vasantha Krishna Prasad
స్థానిక మార్కెట్ యార్డ్​లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
author img

By

Published : Nov 5, 2020, 5:44 PM IST

కృష్ణా జిల్లా మైలవరం మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసన సభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. మార్కెటింగ్, మార్క్ ఫెడ్ అధికారులు, రైతులతో కలసి పూజా కార్యక్రమాలు చేశారు. అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

పండించిన ప్రతి గింజను పారదర్శకంగా కొనుగోలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని చెప్పారు. ఈ కార్యక్రమం మార్కెట్ యార్డు చైర్మన్ పామర్తి శ్రీనివాసరావు, తహసీల్దార్ రోహిణీదేవి తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

వివాహ వేడుకకు సతీసమేతంగా సీఎం జగన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.