కృష్ణా జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు అన్నారు. పోలీస్ అధికారులతో కలిసి గురువారం పట్టణంలోని ప్రధాన కూడళ్లలోని దుకాణాదారులకు.. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని.. దుకాణాల ముందు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఇదీచదవండి: ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని అడ్డుకున్న ప్రజలు.. గోబ్యాక్ అంటూ నినాదాలు