పంట నష్టాన్ని అంచనా వేసి.. నివేదికలు రూపొందించాలని అధికారులను ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు ఆదేశించారు. కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం గని ఆత్కూరులో నీట మునిగిన పొలాలను ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి రైతునూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
భారీ వర్షాల ధాటికి దెబ్బతిన్న గృహాలకు ప్రభుత్వ పరిహారం అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున రైతులు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి: గ్రామాల్లోకి వస్తున్న వరద నీరు..ఆందోళనలో ప్రజలు