ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన గ్రామ వాలంటరీ వ్యవస్థ సమర్థవంతంగా పని చేస్తోందని కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యే జగన్మోహనరావు అన్నారు. పట్టణంలోని 11, 13, 14 వార్డుల్లో ఆయన పర్యటించారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే కాకుండా... కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
అనంతరం వార్డు వాలంటీర్లతో.. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలతో పాటు అనారోగ్య లక్షణాలు కనిపించిన వారి సమాచారాన్ని వెంటనే అందించాలన్నారు. లాక్డౌన్ అమల్లోకి వచ్చినప్పటి వాలంటీర్లు అందిస్తున్న సేవలు వెల కట్టలేనివన్నారు.
ఇదీ చదవండి: