విజయవాడ నగరాభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 43 వ డివిజన్లో 75 లక్షల రూపాయలతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. డివిజన్లో కాలువలు, డ్రైనేజీలు మంచినీటి సమస్యలను పరిష్కరించడంలో స్థానిక కార్పొరేటర్ కృషిని మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి వినతి మేరకు కాలినడకన మంత్రి పలు వీధులను పరిశీలించారు. హెచ్బీ కాలనీ డ్రైనేజీ పంపింగ్ హౌస్కు చుట్టూ ప్రహరీ నిర్మాణం పనులు చేపట్టాలని నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: