తెలుగు మాధ్యమంను ఎవరూ కోరుకోవడం లేదని.. ఒకరిద్దరి పిల్లల కోసం ఈ మీడియం నడపడం ప్రభుత్వంపై భారమవుతుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. పేదల పిల్లలకు నాణ్యమైన మెరుగైన విద్య ఇవ్వాలనే లక్ష్యంతోనే ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టామని తెలిపారు. నాడు-నేడు లాంటి కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయన్నారు. స్కూళ్లో ప్రవేశానికి ప్రజాప్రతినిధులతో సిఫార్సులు తీసుకునే రోజులు త్వరలోనే రాబోతున్నాయని మంత్రి తెలిపారు. విజయవాడ కొత్తపేటలోని చలవాది మల్లిఖార్జునరావు కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో బాలోత్సవం వేడుకలు మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలు, విజ్ఞానం,వినోదం, జానపదం, సామాజిక అంశాలు తదితర 60 అంశాలపై పోటీలు నిర్వహించారు.
ఆంగ్లంతోపాటు తెలుగు కొనసాగించే ప్రతిపాదనలను పరిశీలిస్తాం! - Amaravathi Balotsav in Vijayawada
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని రెండూ కొనసాగించే ప్రతిపాదనలను పరిశీలిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో అమరావతి బాలోత్సవాన్ని ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు.