విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థులను గెలిపించిన స్థానిక ప్రజలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 10 గంటలు గడిపి వైకాపా అభ్యర్థులను, తనను నానా దుర్భాషలాడారని.. వారందరికి సమాధానం నేడు వచ్చిన ఎన్నికల తీర్పేనని అన్నారు. విజయవాడ మేయర్ ఎవరనేది సీఎం నిర్ణయిస్తారని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: