ETV Bharat / state

సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. హైకోర్టులో మంత్రి సబిత పిటిషన్‌ - ఓబులాపురం మైనింగ్​ కేసు సీబీఐ కోర్టు

Sabitha Petition: ఓఎంసీ కేసు నుంచి తనను తప్పించాలని తెలంగాణ హైకోర్టులో మంత్రి సబిత పిటిషన్ వేశారు. ఈ కేసులో సబిత ఇంద్రారెడ్డి డిశ్చార్జి పిటిషన్​ను ఇటీవలే సీబీఐ కోర్టు కొట్టేసింది. సీబీఐ కోర్టు తీర్పును సవాల్​ చేస్తూ.. నేడు హైకోర్టులో మంత్రి పిటిషన్​ వేశారు.

హైకోర్టులో మంత్రి సబిత పిటిషన్‌
హైకోర్టులో మంత్రి సబిత పిటిషన్‌
author img

By

Published : Jan 24, 2023, 3:24 PM IST

Sabitha Petition: ఓబుళాపురం గనుల కేసు నుంచి తప్పించాలని తెలంగాణ హైకోర్టులో మంత్రి సబిత పిటిషన్ వేశారు. ఓఎంసీ కేసులో సబిత ఇంద్రారెడ్డి డిశ్చార్జి పిటిషన్​ను ఇటీవలే సీబీఐ కోర్టు కొట్టేసింది. సీబీఐ కోర్టు తీర్పును సవాల్​ చేస్తూ.. నేడు హైకోర్టులో మంత్రి పిటిషన్​ వేశారు. క్రిమినల్​ రివిజన్​ పిటిషన్​ను హైకోర్టులో విద్యాశాఖ మంత్రి వేసి.. సీబీఐ కోర్టులో ఓఎంసీ కేసు విచారణపై సబితా ఇంద్రారెడ్డి స్టే కోరారు.

ఓఎంసీ పరిణామ క్రమం:

  • ఓఎంసీపై ఫిర్యాదులు రావడంతో 2009 ఏప్రిల్‌లో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ, లీజు ప్రాంతాల సరిహద్దులు నిర్ణయించే వరకు తవ్వకాలు నిలిపివేసింది.
  • ఓఎంసీ అతిక్రమణలకు పాల్పడిందన్న ఆరోపణల్ని ఏపీ ప్రభుత్వం ఖండించింది. దాంతో అటవీశాఖ తన ఉత్తర్వుల అమలు నిలిపివేసింది.
  • 2009 మేలో స్థానిక మైనింగ్‌ వ్యాపారి ఒకరు ఓఎంసీ అక్రమాలపై సుప్రీంను ఆశ్రయించారు.
  • లీజులను సస్పెండ్‌ చేయాలని, సరిహద్దులు గుర్తించాలని, దీనికి అయ్యే వ్యయాన్ని రికవరీ చేయాలని 2009, నవంబరులో సీఈసీ సిఫార్సు చేసింది. తర్వాత రాష్ట్ర కమిటీ సైతం పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్‌ కార్యకలాపాలను నిలిపివేసింది.
  • 2009, డిసెంబరులో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. మరోవైపు ఓఎంసీ హైకోర్టును ఆశ్రయించగా, మైనింగ్‌ కార్యకలాపాలను నిలిపేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్‌ చేసింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది.
  • దీంతో 2010 ఫిబ్రవరిలో మైనింగ్‌ నిలిపేస్తూ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు రద్దుచేసింది.
  • 2011-13లో కర్ణాటకలోని బళ్లారి పరిధిలో కూడా మైనింగ్‌ నిలిపేయాలని ఆదేశించింది. కర్ణాటక మైనింగ్‌ లీజులపై కూడా సీఈసీ పలు నివేదికలు అందజేసింది.
  • ఏపీ, కర్ణాటకల సరిహద్దులను నిర్ణయించేందుకు 12 వారాల గడువు నిర్ణయిస్తూ సుప్రీంకోర్టు 2017 డిసెంబరులో ఆదేశాలు జారీ చేసింది.
  • సరిహద్దుల గుర్తింపు పూర్తి చేయకపోవడంపై 2018లో 2 రాష్ట్రాలను సుప్రీం మందలించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.