కృష్ణా జిల్లా నందిగామ మండలం హనుమంతుపాలెం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కోళ్ల ఫామ్లో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకొని 96 వేలు రూపాయలు విలువ గల 260 బస్తాల బియ్యాన్ని సీజ్ చేశారు. గాడిపర్తి రాజా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కోళ్లఫామ్ నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి...