గ్రామాల్లో ఎవరైనా మత విద్వేషాలు రెచ్చగొడితే.. చట్టపరమైన చర్యలు తప్పవని డీఎస్పీ ఎం.మహబూబ్ బాషా తెలిపారు. స్థానిక రెవిన్యూ కార్యాలయ సమావేశ ప్రాంగణంలో జరిగిన గ్రామ రక్షక దళాల అవగాహన సదస్సులో మచిలీపట్నం డివిజన్ ఆర్డీవో ఖాజావలితో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
సబ్ డివిజన్ పరిధిలోని దేవాలయాల్లో ఇప్పటికే చాలావరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. అవనిగడ్డ, చల్లపల్లి సీఐలు రవికుమార్, వెంకట నారాయణ, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పోలీస్ సిబ్బంది, గ్రామ సచివాలయ మహిళా కానిస్టేబుళ్లు, గ్రామ రక్షక దళ సిబ్బంది... హాజరయ్యారు.
ఇదీ చదవండి: