కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 5వేల 835 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పోర్టు నిర్మించాలని నిర్ణయించింది. తొలి దశ పనులకు సంబంధించి పరిపాలనాపరమైన అనుమతులను మంజూరు చేసింది. రైట్స్ సంస్థ తయారు చేసిన డీపీఆర్‌ను ప్రభుత్వం ఆమోదించింది. 225 ఎకరాల విస్తీర్ణంలో తొలి దశ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆదేశాల్లో తెలిపింది. 36 నెలల్లో నౌకాశ్రయం పూర్తి చేయాలని సూచించింది.
పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెయ్యి కోట్లు, ఏపీ మారిటైం బోర్డు ద్వారా రూ.4,745 కోట్లు రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఏపీ మారిటైం బోర్డు...ఏపీఎంబీ ద్వారా టెండర్లు, తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో తెలిపారు. ఇందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఏపీ మారిటైమ్ బోర్డ్, కాకినాడ వారిని ప్రభుత్వం ఆదేశించింది.
ఇదీచదవండి