ETV Bharat / state

29న హాజరు కావాలి.. కృష్ణాజిల్లా కలెక్టర్​కు లోకాయుక్త నోటీసులు

Lokayuktha Notice To Collector: ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన మాజీ వైద్య శాఖ ఉద్యోగి తెల్లరేషన్ కార్డు పొందిన విషయంలో ఈనెల 29న తమ ముందు హాజరుకావాలని జిల్లా కలెక్టర్​కు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. ఎవరైనా మాజీ ప్రభుత్వ ఉద్యోగి తెల్ల రేషన్ కార్డ్ పొందితే...ఆ నిధులను అతని నుంచి రాబట్టి, కార్డు పొందిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చని పిటిషనర్ శ్రీనివాస్ గౌడ్ చెబుతున్నారు.

Lokayuktha
లోకాయుక్త
author img

By

Published : Dec 22, 2022, 10:45 PM IST

Lokayuktha Notice To Collector: ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన మాజీ వైద్య శాఖ ఉద్యోగి తెల్లరేషన్ కార్డు పొందిన విషయంలో ఈనెల 29న తమ ముందు హాజరుకావాలని జిల్లా కలెక్టర్​కు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. నందిగామ మున్సిపాలిటీ పరిదికి చెందిన మాజీ ఉద్యోగి తెల్లరేషన్ రేషన్ కార్డ్ పొందారని..అతనిపై చర్యలు తీసుకోవాలని ఉయ్యూరుకు చెందిన సామాజికవేత్త జంపాన శ్రీనివాస్ గౌడ్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. పిటిషన్​పై విచారణ జరిపిన లోకాయుక్త ఉమ్మడి కృష్ణాజిల్లా కలెక్టర్​కు నోటీసులు జారీ చేసింది.

ప్రస్తుతం నందిగామ ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉండటంతో.. విచారణ జరిపి సరైన చర్యలు తీసుకోవాలని నందిగామ తహసీల్దార్​ను కలెక్టర్ ఢిల్లీరావు ఆదేశించారు. ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక తమకు సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎవరైనా మాజీ ప్రభుత్వ ఉద్యోగి తెల్ల రేషన్ కార్డ్ పొందితే...ఆ నిధులను అతని నుంచి రాబట్టి, కార్డు పొందిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చని పిటిషనర్ శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు.

ఇవీ చదవండి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.