క్యాబేజీ పంట రైతులకు కన్నీరు మిగిల్చింది. కృష్ణాజిల్లా మోపిదేవి మండలం కోసురువారిపాలెంలో క్యాబేజీ సాగుచేసిన రైతులకు లాక్డౌన్ వలన తీవ్ర నష్టం వాటిల్లింది. క్యాబేజీ కొనేవారు లేక... లాక్డౌన్ ఎత్తివేస్తే కొనేవాళ్లు వస్తారని ఆశగా ఎదురుచూసిన రైతులకు నిరాశే మిగింది. దారి లేక పంటను పొలంలోనే వదిలిపెట్టేశారు. చెమట చిందించి పండించిన పంట కళ్లెదురుగానే ఎండిపోయింది. చేసేది లేక పొలాన్ని దున్నేశారు.
ఎకరం పంటకు సుమారు రూ.50 వేల పెట్టుబడి అయ్యిందని.. కనీసం రూపాయి కూడా చేతికి రాలేదని రైతన్నలు వాపోతున్నారు. మార్కెటింగ్ అవకాశం కల్పించాలని మార్కెటింగ్ అధికారులను కోరినా చర్యలు తీసుకోలేదని రైతులు తెలిపారు. నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలని రైతన్నలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇదీ చదవండి: 'దాడికి పాల్పడిన పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి'