ETV Bharat / state

సబ్సిడీ ఉల్లి కోసం అవనిగడ్డ ప్రజల పాట్లు - పెరిగిపోతున్న ఉల్లి ధరలు

ఉల్లిపాయల ధరలు రోజురోజుకి ఆకాశానంటుతున్నాయి. సబ్సిడీ ఉల్లి కోసం చల్లపల్లి రైతు బజారుకు వెళ్లిన కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రజలు... ఉల్లిపాయలు రేపు వస్తాయనే బోర్డు చూసి నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. చల్లపల్లి రైతు బజారుకు ఇప్పటివరకు ఒక్క కిలో ఉల్లిపాయ కూడా రాకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

locals of avanigadda suffer for not getting subsidy onions
సబ్సీడి ఉల్లి కోసం అవనిగడ్డ ప్రజల పాట్లు
author img

By

Published : Nov 7, 2020, 10:47 PM IST

ఉల్లిపాయల ధరలు రోజురోజుకి పెరుగిపోతూనే ఉన్నాయి, ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా కేజీ రూ.40కి ప్రజలకు సరఫరా చేస్తామని చెప్పిన మాటలు ఆచరణలో మాత్రం నోచుకోలేదు. సబ్సిడీ ఉల్లి కోసం చల్లపల్లి రైతు బజారుకు వెళ్లిన వినియోగదారులకు... రేపు వస్తాయనే బోర్డు చూసి నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోతున్నారు.

మండిపడుతున్న కూరగాయలు, ఉల్లిపాయ ధరలు

కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని... ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో సుమారు 2లక్షల 50వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరందరికి చల్లపల్లిలో ఉన్న రైతు బజారు ఒక్కటే దిక్కు. కాయగూరలు గతంలో వారాంతపు సంతల ద్వారా అమ్మకాలు జరిపేవారు. కరోనా కారణంగా సంతలు కూడా నిర్వహించడం లేదు. ఒక పక్క కూరగాయల ధరలు మండిపడుతుంటే మరో పక్క ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

కిలో ఉల్లి కూడా మార్కెట్​కు చేరుకోలేదు

ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని రైతు బజార్లకు ఉల్లిపాయలు సరఫరా చేస్తామని ప్రకటించిప్పటికీ... చల్లపల్లి రైతు బజారుకు ఇప్పటివరకు ఒక్క కిలో ఉల్లిపాయ కూడా రాలేదు. మార్కెట్​లో కిలో ఉల్లిపాయ రూ.100కు అమ్ముతున్నారు. సబ్సిడీ ఉల్లి సరఫరా చేయడం లేదని తెదేపా కార్యకర్తలు ఆందోళన చెప్పట్టినప్పటికీ... ఇంత వరకు స్పందించలేదని స్థానికులు వాపోతున్నారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చల్లపల్లి రైతు బజారులో... సబ్సిడీ ఉల్లిపాయల అమ్మకం జరిపేలా చర్యలు తీసుకోవాలని అవనిగడ్డ ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

కళ్లకు గంతలు కట్టుకుని... న్యాయదేవతకు వినతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.