ETV Bharat / state

'స్థానిక సంస్థల ఎన్నికలు వైకాపా పాలనకు రిఫరెండం కాదు'

స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్లా వైకాపా జెండా ఎగురుతుందని మంత్రి అవంతి ధీమా వ్యక్తం చేశారు. రాజధాని అంశం అన్ని చోట్లా ప్రభావం చూపదని అన్నారు. అమరావతి ప్రాంత రైతులకు సీఎం జగన్ న్యాయం చేస్తారని పునరుద్ఘాటించారు.

'local body elections is not referendam to ycp rule' says minister avanthi

author img

By

Published : Jan 8, 2020, 5:37 PM IST

తెదేపాపై మంత్రి అవంతి విమర్శలు

మూడు రాజధానుల అంశం తమ ప్రభుత్వ స్థానిక సంస్థల ఎన్నికలకు రిఫరెండం కాదని మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో వైకాపా అన్ని చోట్లా విజయం సాధిస్తుందని ఆయన వెల్లడించారు. సచివాలయం వద్ద మాట్లాడిన ఆయన.. చంద్రబాబులా తమ ప్రభుత్వం పూటకో మాట చెప్పదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లాగానే ఇవి కూడా ఉంటాయని అవంతి అభిప్రాయపడ్డారు. రాజధానుల అంశం అన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపదని అభిప్రాయపడ్డారు.
స్థానిక అంశాలే ఈ ఎన్నికల్లో కీలకమని వివరించారు.

రాజధాని రైతులకు మేలు చేసేలా సీఎం నిర్ణయం

రాజధాని రైతులకు మేలు చేసే నిర్ణయాలనే సీఎం జగన్ తీసుకుంటారని మంత్రి అవంతి శ్రీనివాస్​ పునరుద్ఘాటించారు. తమ ఎమ్మెల్యేలపై దాడులు చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వైకాపా అధికారంలో ఉన్న విషయం తెదేపా గుర్తుంచుకోవాలని మంత్రి వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:

స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.